I&PR: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

by Ramesh Goud |
I&PR: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) అన్నారు. సమాచార శాఖ ఉద్యోగులకు అధునాతన టెక్నాలజీతో కూడిన కొత్త సామాగ్రిని మంత్రి పొంగులేటి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఐ అండ్ పీఆర్(I & PR) శాఖను మరింత పటిష్ట పరుస్తూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇందుకోసమే సమాచార శాఖ క్షేత్ర స్థాయి ఉద్యోగులకు నూతన టెక్నాలజీ(New Technology) పొందుపరిచిన నూతన కెమెరాలు(Cameras), ఇతర పరికరాలు అందించడం జరిగిందన్నారు. ఈ పరికరాలను ఉపయోగించి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్ళాలని సూచించారు. అంతేగాక సమాచార శాఖకు సంబందించిన ఉద్యోగులు తమ విధుల్లో నిబద్దత చూపి, శాఖకు మరింత పేరు తీసుకురావాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.

Advertisement

Next Story

Most Viewed