AP Govt.: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఎత్తివేత

by Shiva |   ( Updated:2025-01-08 07:26:00.0  )
AP Govt.: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ పరీక్షల ఎత్తివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల్లో కీలక మార్పుల చేయనుంది. అదేవిధంగా ఇంటర్ ఫస్టియర్ (Inter First Year) పరీక్షలను నిర్వహించబోమని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా (Kritika Shukla) ప్రకటించారు. తాము కేవలం సెకండియర్ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. పరీక్షల ఎత్తివేతకు సంబంధించి ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి విలువైన సలహాలు సూచనలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదని తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడిట్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయా కళాశాలలు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ఇంటర్నల్‌గా నిర్వహిస్తాయని కృతికా శుక్లా (Kritika Shukla) క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ మొదటి సంవత్సరం అదేవిధంగా 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ ఫస్టియర్‌లో (ఎన్‌సీఈఆర్‌టీ) NCERT సిలబస్‌ను ప్రవేశ పెడుతున్నామని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed