- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral: స్పీడుగా తిరిగే ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపి.. గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించిన తెలంగాణ కుర్రాడు ( వీడియో)
దిశ, వెబ్ డెస్క్ : ప్రతీ ఒక్కరిలో ఏదొక టాలెంట్ ఉంటుంది. అయితే, అది సమయం వచ్చినప్పుడే బయటపడుతుంది. కొందరైతే ప్రపంచ రికార్డులు సాధించడం కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. అవి ఎంత కష్టమైన సరే మధ్యలో ఆపకుండా వారి టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించుకుంటారు. వాళ్లు చేశాక కానీ మనకి తెలీదు.. ఇలా కూడా చేయవచ్చా అని!
ఇలా ఎంతో మంది వరల్డ్ రికార్డులు సాధించి గిన్నిస్ బుక్‌లో ( Guinness Book of World Record) స్థానం సంపాదించుకున్నారు. వారిలోని ప్రతిభను ప్రపంచానికి చూపించిన వారికీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను అందజేస్తూ ఉంటారు. తాజాగా, తెలంగాణకు చెందిన క్రాంతి కుమార్ .. తనలోని ప్రతిభను కనబరిచి గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకున్నాడు. స్పీడ్ గా తిరిగే ఫ్యాన్స్‌ని తన నాలుకతో ఆపి అందర్నీ షాక్ కి గురి చేశాడు. ఇప్పటి వరకు ఇలాంటిది ఎక్కడా చూసి ఉండరు.
వేగంగా తిరిగే ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్లను నాలుకతో ఆపి.. క్రాంతి కుమార్ ( Kranthi Kumar) గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించాడు. ఈ వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్.. షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది. స్పీడుగా తిరుగుతున్న ఎలక్ట్రిక్ ఫ్యాన్స్‌ని తన నాలుకతో ఆపుతున్న సమయంలో నాలుకకు గాయం అయిన లెక్క చేయకుండా ఫ్యాన్ రెక్కలను ఆపాడు. అతని టాలెంట్ ను చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ అధికారులు షాక్ అయ్యారు. అనంతరం, క్రాంతి కుమార్ ప్రతిభని గుర్తిస్తూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును అందజేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్లకి పైగా వీక్షించారు. ఇక నెటిజన్లు అయితే, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.