- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిరిసిల్ల జిల్లాలో మరో బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : భూ కబ్జా విషయంలో మరో బీఆర్ఎస్ కీలక నేత అరెస్ట్ అయినట్లు తెలిసింది. సిరిసిల్లలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. సిరిసిల్లలో ప్రభుత్వ భూముల భూ కబ్జా విషయంలో రోజుకో కోణం వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో అక్రమ పట్టా పొందిన భూ కబ్జాదారుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు బీఆర్ఎస్ అగ్ర నేతల పై కేసులు నమోదై రిమాండ్ కి వెళ్లి బెయిల్ పై రాగా, ఇటీవల తాజాగా జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం తాడూరు మాజీ సర్పంచ్ భర్త సురభి నవీన్ రావ్ పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
తాజాగా అదే మండలం మండపల్లి గ్రామంలో ఓ ప్రభుత్వ భూమి కబ్జా విషయంలో నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోడూరి భాస్కర్ గౌడ్ ను మంగళవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ భూ కబ్జాలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతల అరెస్టు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.