Sharmila : ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు : షర్మిల

by Y. Venkata Narasimha Reddy |
Sharmila : ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు : షర్మిల
X

దిశ, వెబ్ డెస్క్ : పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఆరోగ్య శ్రీ పథకా(Arogya Sri Scheme)న్ని కూటమి ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చివేసిందని ఏపీ కాంగ్రెస్ చీఫ్(AP Congress Chief ) వైఎస్.షర్మిల(YS Sharmila) విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక ఈ పథకం అని..ప్రాణాలు తీసే జబ్బొచ్చినా సంజీవని లాంటి ఆరోగ్య శ్రీ పథకాన్ని.. కూటమి సర్కార్ అనారోగ్యశ్రీగా మార్చిందని మండిపడ్డారు. రూ.3వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా, వైద్యసేవలు నిలిచే దాకా చూడటం అంటే.. పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రనే ఇదంతా అని..ఆరోగ్య శ్రీ పథకానికి మంగళం పాడి ప్రజల ఆరోగ్యంతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆరోపించారు.

ఆరోగ్యానికి పెద్దపీట అంటూనే కత్తిపీట వేస్తున్నారని, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ.. వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టినవి అయినా.. వాటిని చెల్లించే బాధ్యత మీ ప్రభుత్వంపైనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే ఆసుపత్రుల యాజమాన్యాలను చర్చలకు పిలవండని.. పెండింగ్ బకాయిలు రూ.3వేల కోట్లు తక్షణం విడుదల చేయండని కోరారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించి, పథకానికి ఏ లోటూ రాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం నెట్ వర్క్ లోని ఆసుపత్రులకు 3వేల కోట్ల బకాయిల నేపథ్యంలో సోమవారం నుంచి వైద్య సేవలు నిలిపివేశాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులు వైద్య సేవల అంశంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed