- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి
దిశ, జగిత్యాల టౌన్ : ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్విస్టిగేషన్ ఉండాలని, నేర విచారణ, నేర నిరూపణ సమర్థవంతంగా చేయాలని ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదైన కేసులలో నాన్ గ్రేవ్ కేసులు, గ్రేవ్ కేసుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. జిల్లాలు, రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణాను నియంత్రించాలని కోరారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించడంతోపాటు బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించకుండా నిఘూ ఉంచాలని అన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలు అరికట్టడానికి సంబంధిత అధికారులతో కలిసి పనిచేయాలని అన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రవీంద్ర కుమార్, రఘు చందర్, రాములు, ఇన్స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, రఫిక్ ఖాన్, సీఐలు రామ్ నరసింహారెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్, ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.