- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Narendra Modi : ఆర్మీ జవాన్లతో ప్రధాని మోడీ దీపావళి సెలబ్రేషన్స్
దిశ, నేషనల్ బ్యూరో : భారత సైనికులతో కలిసి దీపావళి(Diwali) వేడుకలు జరుపుకునే గొప్ప సంప్రదాయం భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Narendra Modi) హయాంలోనే ప్రారంభమైంది. ఈసారి కూడా ఆయన సైనికులతో కలిసి వెలుగుల పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. గుజరాత్(Gujarat)లోని కచ్ తీరంలో ఉన్న బీఎస్ఎఫ్ జవాన్లతో కలిసి దీపావళి సంతోషాన్ని మోడీ పంచుకున్నారు. వారికి దీపావళి శుభాకాంక్షలు చెప్పి, స్వయంగా లడ్డూలు తినిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.
కచ్ పరిధిలోని సముద్ర జలాల్లో ఉన్న నౌకలో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో మోడీ చిట్‌చాట్ చేయడం ఆ వీడియోలో ఉంది. మరోవైపు దీపావళి సందర్భంగా సరిహద్దుల్లోని పలు చెక్ పాయింట్ల వద్ద చైనా సైనికులకు భారత సైనికులు మిఠాయిలు ఇచ్చి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. కాగా, ఇరుదేశాల మధ్య ఇటీవలే కుదిరిన ఒప్పందం ప్రకారం డెస్పాంగ్, డెంచాక్ ప్రాంతాల నుంచి భారత్, చైనా సైన్యాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తయింది.