- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sandhya Theatre incident:‘తొక్కిసలాటలో నేను చనిపోతా అనుకున్నా’.. CI రాజు నాయక్ ఎమోషనల్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్పా-2’ (Pushpa-2) ప్రీమియర్ షో (Premiere Show) సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దుర్ఘటనలో రేవతి (Revathi) అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ (Sri Tej) ఐసీయూ (ICU) విభాగంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఓ వీడియో రిలీజ్ చేయగా.. తాజాగా మరోసారి చిక్కడపల్లి సీఐ రాజు నాయక్ కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్(Allu Arjun) సంధ్య థియేటర్‌కు(Sandhya Theatre) వచ్చేందుకు మేం పర్మిషన్ ఇవ్వలేదని చిక్కడపల్లి(ChikkadPally) సీఐ రాజు నాయక్(CI Raju Nayak) వెల్లడించారు.
యాజమాన్యం అనుమతి కోరిన మాట వాస్తవమేనని, కానీ ఒకటే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండటం వల్ల హీరో వస్తే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పామన్నారు. ఈ విషయం యాజమాన్యం హీరోకు చెప్పిందో లేదో తమకు తెలియదని పేర్కొన్నారు. రేవతిని బతికించడానికి ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఒక ప్రాణాన్ని కాపాడలేక పోయాననే బాధ గత 15 రోజులుగా కలచి వేస్తోందన్నారు. అలాగే రెండు థియేటర్స్ ఒకే చోట ఉండటంతో క్రౌడ్ ను కంట్రోల్ చేయలేకపోయాం. మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఉన్నారు. వాళ్ళు చూస్తూనే ఉన్నారు. గేట్లు పగలగొట్టి జనాలు లోపలికి వచ్చారు. ఆ తొక్కిసలాటలో నేను కూడా కింద పడిపోయా. నిజానికి ఆ తొక్కిసలాటలో నేనే చనిపోతానని అనుకున్నా. దేవుడి దయ వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్న అని సీఐ ఎమోషనల్ అయ్యారు.
Read More :Sandhya Theater Incident : ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు : బన్నీకి ఏసీపీ మాస్ వార్నింగ్