- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Toll Fee: శాశ్వతంగా వసూల్ చేయడం నిరంకుశత్వమే.. టోల్ ఫీజు బాదుడుపై సుప్రీం కోర్టు కీలక వాక్యాలు..!

దిశ,వెబ్‌డెస్క్: జాతీయ రహదారులు(National Highways), ఎక్స్ ప్రెస్ హైవే(Express Highway)లపై ట్యాక్స్(Tax) పేరుతో వాహనదారుల నుంచి టోల్(Toll) వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. టోల్ ఫీజు వసూలు శాశ్వత ప్రక్రియ కాదని, ఇష్టమొచ్చినతకాలం టోల్ వసూల్ చేయడం నిరంకుశత్వమేనని సుప్రీం కోర్టు(Supreme Court) తేల్చిచెప్పింది. ప్రాజెక్ట్‌లనేవి ప్రజలకే తప్పా.. ప్రైవేట్ సంస్థలకు దోచిపెట్టడానికి కాదని వ్యాఖ్యానించింది. ప్రజలపై అన్యాయంగా భారం మోపుతూ కాంట్రాక్టర్ల జేబులు నింపడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ-నోయిడా డైరెక్ట్ (DND)ఫ్లై వేపై టోల్ ఫీజు వసూలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) ఇచ్చిన తీర్పును సమర్దించింది. డీఎన్‌డీ ఫ్లై వే టోల్ ఫీజు వసూలు విషయంపై కుదిరిన రాయితీ ఒప్పందాన్ని 2016లో అలహాబాద్ హైకోర్టు రద్దుచేసింది. దీన్ని నోయిడా టోల్ బ్రిడ్జి కంపెనీ(NTBC) సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సరైందేనని తాజాగా వాఖ్యానించింది.