- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రియల్ స్టోరీ.. కూతుర్ని మాయలో పడేసిన యువకుడికి..భార్యతో హాని ట్రాప్..చివరికి..
దిశ, సిటీక్రైం : ఏడాదిన్నర నుంచి తప్పిపోయిన బావ కోసం వెతుకుతున్న బావమరిదికి బావ ఆటో కనిపించింది. బావతో కలిసి అందంగా ముస్తాబు చేసిన ఆటో ను ఎక్కి అన్ని పరిశీలించుకున్న బావమరిది ఆ సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు ఇవ్వడంతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లో కనిపించే ట్విస్టులతో కూడిన రియల్ మర్డర్ మిస్టరీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసుల తో పాటు రెండు కుటుంబాలు షాక్ కు గురయ్యాయి. ఈ మొత్తం మిస్టరీలో ఓ మైనర్ బాలిక స్నాప్ చాట్ మోజులో పడి కిడ్నాప్ కు గురికాగా, కూతురిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని బాలిక తల్లి ట్రాప్ చేయగా తండ్రి అతనిని చంపేశాడు. ఏడాదిన్నర తర్వాత బయటపడ్డ ఈ మర్డర్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన ఓ కారు డ్రైవర్ భార్య , కూతురితో కలిసి హైదరాబాద్ జగద్గీర్ గుట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
కరోనా కారణంగా 7 వ తరగతి కూతురికి చదువు కు ఆటంకం కలగొద్దని తండ్రి ఓ ట్యాబ్ ను ఇప్పించాడు. ఆ ట్యాబ్ లో స్నాప్ చాట్ డౌన్లోడ్ చేసుకున్న కూతురికి కుమార్ అనే వ్యక్తి స్నాప్ చాట్ ద్వారా పరిచయమయ్యాడు. ఆ చాట్ లో కుమార్ బాలికను నీవు చాలా అందంగా ఉంటావు. నీవు సినిమా ఛాన్స్ లకు ట్రై చేస్తే పక్కా హీరోయిన్ అవుతావని ట్రాప్ చేశాడు. ఇలా ట్రాప్ చేసి బాలికను కిడ్నాప్ చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చిన బాలికను యూసుఫ్ గూడ లోని ఓ గదిలో పెట్టిన కుమార్ ఓ సందర్భంలో తాగిన మత్తులో బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. ఆ బాలిక అక్కడి నుంచి తప్పించుకుని బాలానగర్ ప్రాంతానికి వచ్చేసింది.
బాలికను గమనించిన పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చిన కారణంగా తనను ఇంట్లో వారు మందలిస్తారనే భయంతో బాలిక పోలీసులకు తాను అనాథను అంటూ చెప్పింది. దీంతో పోలీసులు బాలికను నగరంలోని ఓ ప్రభుత్వ సంస్థలో చేర్పించారు. గత ఏడాది డిసెంబరులో బాలికను ఓ జంట దత్తతకు తీసుకునేందుకు వచ్చారు. ఆ సందర్భంలో బాలిక తనకు తల్లిదండ్రులు ఉన్నారనే విషయం చెప్పింది. దీంతో ప్రభుత్వ సంస్థ వారు బాలిక తండ్రికి సమాచారం ఇచ్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు వచ్చి అన్ని ఆధారాలను చూపించి గత ఏడాది డిసెంబరులో ఇంటికి తీసుకు వెళ్ళిపోయారు. అందరూ సంతోషంగా ఉన్నారు.
క్రైం స్టోరీ ఇలా మొదలైంది
తమ కూతురు మూడు రోజులుగా కనిపించకపోవడంతో తండ్రి తన కూతురి ట్యాబ్ ను శోధించాడు. అందులో బాలిక కుమార్ తో జరిపిన స్నాప్ చాట్ ను గుర్తించాడు. బాలికను కుమార్ కిడ్నాప్ చేశాడని గుర్తించి భార్యతో కలిసి కుమార్ తో స్నాప్ చాట్ లో చాటింగ్ చేయించాడు. గత ఏడాది మార్చిలో బాలిక తల్లి తాను ఒంటరిగా ఉంటున్నానని తనకు తోడు కావాలంటూ కుమార్ హాని ట్రాప్ చేసి అతనిని మియాపూర్ లోని నిర్మానుష్య ప్రాంతంలోకి రావాలని కోరింది. కుమార్ ఆ ప్రాంతానికి వెళ్ళడంతో కార్డు డ్రైవర్ అతని పై దాడికి దిగి తన కూతురుని ఏం చేశావంటూ చితకబాదాడు. తనకు తెలియదని బాలిక మూడు రోజుల ఉన్న తర్వాత పారిపోయిందని చెప్పాడు. ఆ దెబ్బలకు కుమార్ స్పృహ కోల్పోవడంతో అతనిని కారు డ్రైవర్ అతని భార్య కారు డిక్కీలో పడేసి మియాపూర్ నుంచి జగద్గీర్ గుట్టకు చేరుకున్నారు.
తెల్లవారు జాము ఉదయం సూర్యాపేట జిల్లా కోదాడ పోలీస్ పరిధిలోని నాగార్జున్ సాగర్ ఎడమ కాలువ దగ్గరకు చేరుకున్నారు. అక్కడ కారు డిక్కీ తీయగానే కుమార్ అరవడంతో అతనిని మరోసారి చితక బాది కాళ్లు చేతులు కట్టేసి, ఓ బండరాయిని కట్టి అతనిని కాలువలో పడేసి తిరిగి హైదరాబాద్ కు వచ్చేసి యథావిధిగా జీవనం కొనసాగించారు. కుమార్ మిస్సింగ్ అతని భార్య జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2023, మార్చి 12వ తేదీ నాడు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన బోరబండ పోలీస్ ఏరియాకు రావడంతో 2023 ఆగస్టు నుంచి బోరబండ పోలీసులు ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుమార్, బావమరిది ఇటీవల సైబరాబాద్ ఐటీ కారిడార్ లో కుమార్ ఆటోను గుర్తు పట్టాడు. అయితే ఆటో నెంబరు వేరుగా ఉండటంతో కొంత గందరగోళానికి గురయ్యాడు.
ఆ తర్వాత తన బావతో కలిసి ఆటోను ముస్తాబు చేసిన సందర్భంలో ఆటో వెనకాల స్టీల్ తో కూడిన బంఫర్ , ఆటో రూఫ్ టాప్ డెకరేషన్, ఆటో ముందు చేసిన వెల్డింగ్ మార్క్ లను గుర్తించాడు. ఇది పక్కా తన బావ కుమార్ ఆటో అని నిర్ధారించుకుని ఆటో నడుపుతున్న డ్రైవర్ వివరాలు, ఆటో కు ఉన్న మార్చిన నెంబరు వంటి పూర్తి వివరాలను బోరబండ పోలీసులకు అందించాడు. పోలీసులు ఈ వివరాలతో ఆ ఆటోను గుర్తించి డ్రైవర్ ను, అతని భార్యను అదుపులోకి తీసుకుని ఇంటరాగేషన్ చేయగా కుమార్ మర్డర్ మిస్టరీ బయటపడింది.
వారు చెప్పిన వివరాలను బట్టి కోదాడ పోలీసులను సంప్రదించగా కాలువలో కొట్టుకొచ్చిన మృతదేహానికి సంబంధించి అక్కడి పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను పరిశీలించి పోలీసులు కుమార్ హత్యను ధ్రవీకరించుకున్నారు. ఆ ఎముకలకు డిఎన్ఏ పరీక్షలను పోలీసులు నిర్వహించి శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. కుమార్ ను చింపేసిన తర్వాత అతని ఆటోకు మరో ఆటో నంబరును వేసుకుని తిరుగుతున్నట్లు హంతకుడు పోలీసులు తెలిపాడు. ఈ విధంగా ఏడాదిన్నర కింద జరిగిన మర్డర్ మిస్టరీని హైదరాబాద్ బోరబండ పోలీసులు చేధించారు. ఒక చాటింగ్ లో చోటు చేసుకున్న ట్రాప్ ఒకరిని చంపేయగా, భార్య భర్తలను జైలు పాలు చేసింది.