- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మార్నింగ్ వాక్
దిశ, కల్వకుర్తి : ప్రజా సమస్యల పరిష్కారం కోసమై మార్నింగ్ వాక్ నిర్వహిస్తున్నట్లు కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కసిరెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ ఠాకూర్ బాలాజీ సింగ్ మార్నింగ్ వాక్ లో పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తమ వద్దకు తిరగొద్దనే ఉద్దేశంతో తాను ప్రజల వద్దకు వస్తున్నానని అన్నారు. అభివృద్దికి సంబంధించిన సూచనలు, సలహాలు కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు.
పేదల సంక్షేమం కోసమై కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే వృద్దులకు 4 వేల పెన్షన్, మహిళలకు 2500 వేలు మంజూరు చేస్తామన్నారు. అనంతరం రాష్ట్రంలోని ౩౩ జిల్లాల నుంచి 1120 మంది పాల్గొన్న 10వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలను కసిరెడ్డి ప్రారంభించారు. మండల పరిధిలోని ఎల్లికల్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ, ఆర్అండ్బీ సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల శంకు స్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని శుభం కన్వేషణ్ హాల్ లోని క్రిస్మస్ విందు కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.