ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి

by Kalyani |
ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి
X

దిశ, గజ్వేల్ రూరల్ : ఆర్టీసీ బస్సు కింద పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన బుచ్చవ్వ (70) అనే వృద్ధురాలు తన ఇంటి అవసరాల నిమిత్తం గజ్వేల్ పట్టణానికి వచ్చింది. ఈ తరుణంలో పట్టణంలోని ఇందిరా పార్కు చౌరస్తాలో రోడ్డు దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు దుబ్బాక డిపోకు చెందిన AP29Z3332 నెంబర్ గల బస్సు కింద పడటంతో కాళ్ళు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది బాధితురాలిని హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆర్వీఎం ఆసుపత్రికి అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా బుచ్చవ్వ మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గజ్వేల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story