భూ భారతి చట్టంపై రైతులతో ముఖాముఖీ

by Kalyani |
భూ భారతి చట్టంపై రైతులతో ముఖాముఖీ
X

దిశ, నల్లగొండ : జాతీయ రైతు దినోత్స‌వ సందర్బంగా రైతు సేవా ఫౌండేష‌న్‌ (ఆర్ఎస్ఎఫ్‌) ఆధ్వ‌ర్యంలో భూ భారతి చట్టం-2024పై రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నట్లు రైతు సేవ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. భార‌త 5వ ప్ర‌ధాని చౌద‌రి చ‌ర‌ణ్‌సింగ్ జ‌యంతి డిసెంబ‌రు 23న ప్ర‌తి ఏడాది జాతీయ రైతు దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తేనున్న భూ భారతి చట్టం-2024పై నల్గొండ జిల్లా చందంపేట మండ‌లం కంబాల ప‌ల్లిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 23న ఉద‌యం 7గంట‌ల‌కు స‌ద‌స్సులో ఆర్ఎస్ఎఫ్ ఛైర్మ‌న్ ఎం.సునీల్‌కుమార్‌, అధ్య‌క్షులు వి.ల‌చ్చిరెడ్డి పాల్గొంటున్నారని ప్రతినిధులు తెలిపారు.

రైతు సేవా ఫౌండేష‌న్ నేప‌థ్యం

గ్రామాల్లో రైతుల కోసం సేవా కేంద్రాల ఏర్పాటు, రైతుల సంక్షేమం కోసం కృషి, రెవెన్యూ చట్టాలపై అవగాహన, రైతుల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌ త‌దిత‌ర కార్యక్రమాలపై రైతు సేవా ఫౌండేష‌న్ ప‌ని చేస్తూ వ‌స్తోంది. దేశం కోసం బీఎస్ఎఫ్,రైతుల కోసం ఆర్ఎస్ఎఫ్‌ అనే నినాదంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story