Panjab: పంజాబ్ సరిహద్దులో కలకలం.. నాలుగు డ్రోన్లు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

by vinod kumar |
Panjab: పంజాబ్ సరిహద్దులో కలకలం.. నాలుగు డ్రోన్లు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
X

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ సరిహద్దులో కలకలం నెలకొంది. 24 గంటల వ్యవధిలోనే బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (BSF) దళాలు నాలుగు డ్రోన్లతో పాటు భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు ఓ ప్రకటనలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. పంజాబ్ పోలీసులు, బీఎస్ఎఫ్ దళాలు సంయుక్తంగా ఆదివారం టార్న్ తరణ్ (Tarn tharan) జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు డీజేఐ ఎయిర్3S డ్రోన్లు, 558, 613 గ్రాముల బరువున్న రెండు హెరాయిన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఉదయం 10 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌(Amruthsar) లోని రత్తన్‌ఖుర్డ్ గ్రామ వ్యవసాయ క్షేత్రం వద్ద డీజేఐ మ్యాజిక్ 3 క్లాసిక్ డ్రోన్‌ను గుర్తించాయి. అలాగే శనివారం సాయంత్రం బీఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ వింగ్ సమాచారం ఆధారంగా అమృత్‌సర్ జిల్లాలోని దరియా మూసా గ్రామం సమీపంలో మరొక డ్రోన్‌ను పట్టుకున్నారు. దీంతో ఒక రోజు వ్యవధిలోనే నాలుగు డ్రోన్లు పట్టుబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనే వివరాలను వెల్లడించలేదు.

Advertisement

Next Story