Siddaramaiah: మహిళా మంత్రిని దూషించిన ఆధారాలున్నాయ్- సీటీ రవిపై కర్ణాటక సీఎం విమర్శలు

by Shamantha N |
Siddaramaiah: మహిళా మంత్రిని దూషించిన ఆధారాలున్నాయ్- సీటీ రవిపై కర్ణాటక సీఎం విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. మహిళా మంత్రిపై వాడిన అభ్యంతరకర భాషకు సంబంధించి ఆడియో, వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆయన అలా మాట్లాడటం కొందరు ఎమ్మెల్సీలూ విన్నారని తెలిపారు. ఇది క్రిమినల్‌ కేసు అవ్వడంతోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు. మరి దీనిపై ఎమ్మెల్సీ రవి జ్యుడీషియల్‌ విచారణ ఎందుకు అడుగుతున్నారో ఆశ్చర్యంగా ఉందన్నారు. అలానే, బీజేపీ సీనియర్‌ నేతగా ఉన్న రవి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.

సీటీ రవి- లక్ష్మి మధ్య వాగ్వాదం

ఇకపోతే, కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా డిసెంబర్‌ 19న అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌((Karnataka cabinet minister Laxmi Hebbalkar))-సీటీ రవి మధ్య మొదలైన మాటల యుద్ధం చివరకు పోలీస్‌ స్టేషన్లు, న్యాయస్థానాల వరకు వెళ్లింది. తనపట్ల బీజేపీ ఎమ్మెల్సీ వ్యక్తిగత దూషణలు చేశారంటూ మంత్రి ఫిర్యాదు చేయడంతో ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు. ఫస్ట్ ఖానాపుర్ పోలీస్‌స్టేషన్‌కు, ఆ తర్వాత రామ్‌దుర్గా స్టేషన్‌కు తరలించారు. తన తలకు గాయమైందని..తనకు ఏదైనా అయితే అది పోలీసులది, ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. తన తలకు గాయమైందని ఎక్స్‌లో తెలిపారు. పోలీసులు తనపై ఏదో కుట్ర పన్నారని, గాయమైన వ్యక్తికి ప్రథమచికిత్స అందించేందుకు కర్ణాటక పోలీసులు మూడు గంటల సమయం తీసుకున్నారని వెల్లడించారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ రావడంతో బయటకొచ్చారు.

Advertisement

Next Story