- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ajit Pawar: మంత్రిత్వ శాఖల ప్రకటనతో కొందరిలో అసంతృప్తి.. అజిత్ పవార్
దిశ, నేషనల్ బ్యూరో: మంత్రులకు పోర్ట్ ఫోలియోల కేటాయింపు అనంతరం కొందరు అసంతృప్తితో ఉన్నారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ (Ajith pawar) అన్నారు. మంత్రుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిమితుల ప్రకారం సీఎం ఫడ్నవీస్ (Fadnavis) మంత్రులకు ఒక్కో శాఖ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. దీనిపై పలువురు సంతోషంగా ఉంటే మరికొందరిలో అసంతృప్తి ఉందన్నారు. ఆదివారం తన నియోజకవర్గమైన బారామతి(Baramathi)లో పర్యటించి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్‌లో కేవలం ఆరుగురు మాత్రమే రాష్ట్ర మంత్రులు ఉన్నారని, మిగిలిన 36 మంది కేబినెట్ మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు.
రాజకీయాల్లో అసంతృప్తులు సహజమేనని తెలిపారు. శాఖలు కేటాయించిన తర్వాత పలువురు మంత్రులు తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టుల పనులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని, వాటన్నింటి పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. కాగా, మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలోని మంత్రులకు శనివారం శాఖలు కేటాయించారు. అయితే హోం శాఖ ఆశించిన డిప్యూటీ సీఎం షిండేకు ఆ పదవి దక్కలేదు. దీంతో షిండే నిరాశకు గురయ్యారని పలు కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అజిత్ పవాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.