మర్రిచెట్టు కింద మనోళ్ళు.. వైరల్ అవుతున్న ఫొటోలు

by sudharani |   ( Updated:2024-12-22 15:53:19.0  )
మర్రిచెట్టు కింద మనోళ్ళు.. వైరల్ అవుతున్న ఫొటోలు
X

దిశ, సినిమా: ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన, ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’. శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై డైరెక్టర్ నరేష్ వర్మ ముద్దం తెరకెక్కిస్తున్న ఈ మూవీ.. తాజాగా సారథి స్టూడియోలో పూజ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. సీనియ‌ర్ న‌టుడు బాబు మోహన్ (Babu Mohan) న‌టీన‌టుల‌పై క్లాప్ కొట్టారు. ఆర్టిస్టు నాగ మహేష్ (Naga Mahesh) కెమెరా స్విఛాన్ చేశారు.

థ‌ర్టీ ఇయ‌ర్స్ పృథ్వీ, రాజీవ్ కనకాల (Rajiv Kanakala), తెలుగు ఫిలించాంబ‌ర్ అధ్యక్షులు దామోద‌ర ప్రసాద్ (Damodara Prasad), నిర్మాత సీ కళ్యాణ్, టీ ఎం ఏ ఏ ప్రెసిడెంట్ ర‌ష్మీ ఠాగుర్ చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా దర్శకుడు నరేష్ వర్మ ముద్దం మాట్లాడుతూ.. ‘ప్రతి ఒక్కరిని అల‌రించే విధంగా ఒక మంచి స‌బ్జెక్టుతో చేస్తున్న చిత్రమిది. ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప్రారంభానికి ముందే ఈ సినిమా జ‌నాల్లోకి వెళ్లిపోయింది. ఈ సినిమాను స‌పోర్టు చేసి, ఆద‌రించాల‌ని అంద‌రిని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

Advertisement

Next Story