- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద అగ్ని ప్రమాదం

దిశ,నాగర్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్ వద్ద బుధవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం నాగార్జునసాగర్ ప్రధాన డ్యాం ఎడమ వైపు ముఖద్వారం నుండి కిలోమీటర్ మేర మంటలు చేరలేగి గడ్డి దానితోపాటు విద్యుత్ సరఫరా అయ్యే కరెంటు వైర్లు, సీసీ కెమెరాలు సంబంధించిన వైర్లు పూర్తిగా ఆహుతి అయిపోయాయి. నాలుగున్నర ప్రాంతంలో మెయిన్ డాం దిగువ భాగాన ఉన్న వ్యూ పాయింట్ వద్ద మంటలు చెలరేగుతున్న దృశ్యాన్ని పసిగట్టిన సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతోపాటు ఎండ తీవ్రతకు ఎండి పై ఉన్నటువంటి చిన్న చిన్న చెట్లు, గడ్డి పూర్తిగా తగలబడింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రధాన డ్యామ్ వద్ద ఏం జరుగుతుందో అని స్థానికులు భయానికి గురయ్యారు. ఈ ప్రమాదం కారణంగా ప్రధాన డ్యాం పై కిలోమీటర్ మేర పొగతో నిండిపోయింది.
ఫైర్ ఇంజన్లకు సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్లు మరియు నందికొండ మున్సిపాలికి సంబంధించిన నీటి ట్యాంకులతో సిబ్బంది మంటనార్పే ప్రయత్నం చేశారు. రాత్రి వరకు కొద్ది మేరకు మంటలు అదుపులోకి వచ్చిన, పూర్తి స్థాయిలో ఆపేందుకు సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. డ్యాం ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరగడానికి కారణాలు, జరిగిన నష్టం పై ఆరా తీస్తున్నారు. డ్యాం పై పని చేసే సిబ్బంది అప్రమత్తంగా ఉన్న కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన దానికి సమీపంలో ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ వరకు వెళ్లకుండా ఆపగలిగారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది.