పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాలి : ఎస్పీ జానకి

by Aamani |
పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాలి : ఎస్పీ జానకి
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: నేటి నుంచి మొదలైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాలని జిల్లా ఎస్పీ జానకి పోలీస్ సిబ్బందికి ఆదేశించారు.శుక్రవారం పట్టణంలోని వివిధ పాఠశాలలో మొదలైన పదో తరగతి పరీక్షలు జిల్లా ఎస్పీ జానకి ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా మొదలై,కొనసాగుతున్నాయి.ఈ సందర్భంగా ఆమె పట్టణంలోని మాడ్రన్ హై స్కూల్,చైతన్య సెంట్రల్ స్కూల్ లో జరుగుతున్న పరీక్షల బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సంబంధిత పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.పరీక్షలు రాసే విద్యార్థులకు రవాణా సౌకర్యాలను కూడా ఆమె పర్యవేక్షించి,అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ను సమర్థంగా నియంత్రించాలని ఆమె అధికారులను ఆదేశించారు.పరీక్షా కేంద్రాల వద్ద అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలని,శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.పరీక్షలు రాసే విద్యార్థులతో పాటు వచ్చే వారి తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుడా తమ పోలీస్ సిబ్బంది పూర్తి సహకారం అందించనుందని ఎస్పీ జానకి తెలియజేశారు.

Next Story