- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ట్రెండింగ్ కల్చర్ : నాలుగు రోజులే పని.. మిగతా రోజులు శృంగారంలో మునిగి తేలడమే..

దిశ, ఫీచర్స్ : జపాన్ దశాబ్దాలుగా తగ్గుతున్న మదగ రేటుతో పోరాడుతోంది. ఇప్పటికే తొమ్మిది మిలియన్ ఇండ్లు జనం లేక ఖాళీ అయిపోగా.. బర్త్ రేట్ పెంచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే టోక్యో వారానికి నాలుగు రోజుల వర్కింగ్ డేస్ ఇంట్రడ్యూజ్ చేసింది. ఇంతకీ ఈ రూల్ ఎందుకు తీసుకొచ్చింది? జనాభా పెరిగేందుకు ఎలా హెల్ప్ చేస్తుంది? పనిలో తక్కువ సమయం గడిపితే ఫామిలీ రిలేషన్స్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుంది?
వృద్ధాప్య జనాభా జపాన్‌కు ప్రస్తుతం పెద్ద ఆర్థిక సమస్యగా మారింది. ప్రపంచంలోనే అత్యల్ప జనన రేటు కలిగిన దేశాలలో ఇదీ ఒకటి.కాగా శ్రామిక శక్తి వేగంగా తగ్గిపోతున్నందున ప్రభుత్వం పరిష్కారాల కోసం వెతుకుతోంది. తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, సబ్సిడీతో కూడిన పిల్లల సంరక్షణ, పెళ్లి చేసుకుంటే కానుకలు వంటి విధానాలు తీసుకురాగా.. అవి కూడా పెద్దగా పనిచేయకపోవడంతో క్రిటికల్ వర్కింగ్ కల్చర్‌ను తగ్గించడం వల్ల వ్యక్తిగత జీవితాలపై ఫోకస్ చేస్తారనే ఆలోచనతో ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఫ్యామిలీ, రిలేషన్స్.. ఫైనల్‌గా పిల్లలను కనడంపై ఎక్కువ సమయం కేటాయిస్తారని ఆలోచించింది.
జపాన్‌లో తగ్గుతున్న జనన రేటు కేవలం సమయం వల్ల మాత్రమే కాదు ఖర్చు, కల్చర్, మారుతున్న ప్రాధాన్యతల గురించి. చాలా మంది యువకుల ఆర్థిక అస్థిరత, పిల్లల సంరక్షణ మద్దతు లేకపోవడం, వర్కింగ్ టార్గెట్స్ డిమాండ్ చేయడం.. తల్లిదండ్రులుగా మారేందుకు భయపడేందుకు, అసలు ఆ ఆలోచన చేయకపోవడానికి కారణాలుగా ఉన్నాయి. కాగా నాలుగు రోజుల పనివారం ప్రజలకు ఎక్కువ విశ్రాంతి ఇస్తే ఎంతో కొంత సహాయపడవచ్చు..కపుల్స్ ప్రైవసీగా ఉండేందుకు, శృంగారంలో పాల్గొనేందుకు సమయం అధికంగా ఉండొచ్చు అనేది ఈ ఫోర్ డే వర్కింగ్ రూల్ ఉద్దేశం.
Read More..
పెళ్ళికి వారం రోజుల ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు .. ఎందుకంటే..?