Rashmika Mandanna: ఏ స్థితిలో ఉన్నా ఆ పని చేయాల్సిందే.. రష్మిక పోస్ట్ దేని గురించంటే?

by Hamsa |
Rashmika Mandanna: ఏ స్థితిలో ఉన్నా ఆ పని చేయాల్సిందే.. రష్మిక పోస్ట్ దేని గురించంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘చలో’సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి అనతి కాలంలోనే ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ‘పుష్ప’ మూవీతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఇక ఇటీవల రష్మిక నటించిన పుష్ప-2, యానిమల్(Animal), ఛావా బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో పాటు బాక్సాఫీసును షేక్ చేసిన విషయం తెలిసిందే.

అదే ఫామ్‌తో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం రష్మిక మందన్న సికందర్, కుబేర, ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend) మూవీస్ చేస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూడు చిత్రాలు త్వరలోనే థియేటర్స్‌లోకి రానున్నాయి. అయితే రష్మిక ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, నేషనల్ క్రష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా.. నేను ఎల్లప్పుడూ వ్యాయామం చేయడానికి ఒక మార్గాన్ని కనుగొంటాను. నేను ఇష్టపడే పనులు చేయకుండా ఎవరూ నన్ను ఆపలేరు’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే వర్కౌట్ చేస్తున్న ఫొటోను జత చేసింది. ఇక అది చూసిన వారంతా ఆమె డెడికేషన్‌కు ఫిదా అయిపోతున్నారు.

Next Story