Viral news: షాకింగ్.. 76 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు.. ఎక్కడంటే?

by D.Reddy |
Viral news: షాకింగ్.. 76 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు.. ఎక్కడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో ప్రతి స్త్రీకి తల్లి (Mother) కావడం అనేది అందమైన, అద్భుతమైన అనుభూతి. సాధారణంగా గర్భధారణకు 25 నుంచి 30 ఏళ్ల వయసు అనువైనదిగా వైద్యులు (Doctor) చెబుతుంటారు. ఈ సమయంలో పుట్టే పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ఇక వయసు పెరిగే కొద్ది గర్భధారణకు కూడా అవకాశాలు తగ్గిపోతుంటాయి. పుట్టే పిల్లల్లో కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటిది ఏడు పదుల వయసులో గర్భం దాల్చటం అంటే వింతగానూ, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసలు ఆ వయసులో చాలా మంది స్వయంగా తమ పనులు కూడా చేసుకోలేక మచ్చానికే పరిమితమై ఇబ్బందిపడుతుంటారు. కానీ, ఇథియోఫియా (Ethiopia) దేశంలో మాత్రం ఈ అరుదైన వింత ఘటన వెలుగుచూసింది.

ఇథియోఫియా దేశంలోని మెకెల్లే ప్రాంతానికి చెందిన మెధిన్ హగోస్‌కు 76 ఏళ్లు. తాజాగా ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా, వైరల్‌గా మారింది. పెళ్లైన నాటి నుంచి పిల్లల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలయ్యారు. పూర్తి ఆశలు వదులుకున్న సమయంలో ఇన్నాళ్లకు తాము సహజంగా గర్భంగా దాల్చి, తల్లి అవ్వటం ఎంతో ఆనందంగా ఉందని తమ సంతోషాన్ని పంచుకున్నారు. అయితే, దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది నెటిజన్లు వారికి అభినందలు తెలుపుతుండగా.. IVF పద్ధతిలో గర్భం దాల్చి కూడా సహజంగా ప్రెగ్నెంట్ అయినట్లు చెబుతారని, ఈ వయసులో సహజంగా గర్భం దాల్చటం అసంభవమని మరికొందరు వాదిస్తున్నారు. కాగా, ఐవీఎఫ్ (In Vitro Fertilization) పద్ధతిలో చాలా మంది పిల్లలు లేని జంటలు గర్భం దాల్చుతున్నారు. గతంలో 60 ఏళ్లు పై పడిన వారు కూడా ఈ పద్ధతిలో గర్భం దాల్చి ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనిచ్చారు.

Next Story

Most Viewed