కొండాపూర్ సుబ్బయ్య హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

by Aamani |
కొండాపూర్ సుబ్బయ్య హోటల్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
X

దిశ, శేరిలింగంపల్లి : ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస దాడులు చేస్తూ హడలెత్తిస్తున్నారు. కొండాపూర్ లోని కాకినాడ సుబ్బయ్య హోటల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ తో పాటు కిచెన్ లో డ్రైనేజీ వాటర్ పొంగుతున్నట్లుగా గుర్తించారు. అలాగే కాలం చెల్లిన కూరగాయలు, ఫ్రిజ్ లో నిల్వ ఉంచడంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బయ్య హోటల్ యాజమాన్యం ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ కూడా డిస్ప్లే చేయడం లేదని, హోటల్ లో పనిచేస్తున్న స్టాఫ్ కూడా కనీసం హ్యాండ్ గ్లోవ్స్, హెడ్ కాప్స్ కూడా ధరించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే ఒకసారి వాడిన నూనెలను మళ్లీ మళ్లీ వాడుతున్నారని, కిచెన్ ఏమాత్రం హైజెనిక్ గా లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed