- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మరోసారి భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తెల్లవారు జామును రెండుసార్లు భూకంపం (Earthquake) సంభవించింది. ఈ రోజు ఉదయం ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లో రెండు సార్లు భూకంప ప్రకంపణలు కనిపించాయి. భారత నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) ప్రకారం.. మొదటి భూకంపం ఉదయం 4:51 గంటలకు రాగా రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రత నమోదైంది. అలాగే రెండవ భూకంపం ఉదయం 5:16 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో సంభవించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. కాగా ఈ వరుస భూకంపాల వచ్చిన ప్రకంపణలు ఆఫ్ఘనిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గుచియేశాయి. అయితే ఇప్పటివరకు పెద్ద ఎత్తున నష్టం లేదా ప్రాణనష్టం గురించి నిర్ధారిత సమాచారం అందలేదు. ఇదిలా జూన్ 22, 2022న తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా, ఖోస్ట్ ప్రాంతాల్లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా మరణించారు. వేలాది మంది గాయపడ్డారు, 10,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇది రెండు దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన భూకంపాలలో ఒకటిగా నమోదైంది. అలాగే 2023 అక్టోబర్ నెలలో హెరాత్ ప్రాంతంలో వరుసగా మూడు భూకంపాలు (6.3 తీవ్రతతో) అక్టోబర్ 7, 11, 15 సంభవించాయి. ఈ భూకంపాల్లో మొత్తంగా 1,500 నుండి 2,000 మంది మరణించారు. వేలాది ఇళ్లు ధ్వంసమై, లక్షలాది మంది ప్రభావితులయ్యారు. ఈ భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్‌లోని నిర్మాణాలు (ఎక్కువగా మట్టి, చెక్కతో చేసిన ఇళ్లు) భూకంప నిరోధకత లేకపోవడం, దేశంలోని దుర్గమ ప్రాంతాలు, దీర్ఘకాల సంఘర్షణల వల్ల సహాయక చర్యలు ఆలస్యం కావడం వంటి కారణాలతో అధిక నష్టాన్ని కలిగించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో సంవత్సరానికి సగటున 560 మరణాలతో, గత దశాబ్దంలో 7,000 మందికి పైగా భూకంపాల వల్ల మరణించారు.