- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
CM Revanth: మోస్ట్ పవర్‌ఫుల్ లీడర్స్ లిస్ట్‌లో సీఎం రేవంత్.. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడి

దిశ, తెలంగాణ బ్యూరో: తన పరిపాలనా నైపుణ్యం.. ప్రభావంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా నిలిచారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39వ స్థానంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. ఈ జాబితాతో సీఎం రేవంత్ రెడ్డిని ఇండియా కూటమిలోని ఇతర ప్రముఖులైన సీఎంల సరసన నిలిపింది.
విధానపరమైన నిర్ణయాలతో...
రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేయడం, క్వింటాల్ ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌లు, యువతను నిపుణులుగా తీర్చిదిద్దే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ట్రాఫిక్ పో లీస్ విభాగంలో ట్రాన్స్‌జెండర్ల నియామకం వంటి అనేక విధానపరమైన వినూత్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాదరణ పెరగడానికి కారణమయ్యాయి. పారదర్శకమైన పాలన, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడినందునే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అత్యంత శక్తిమంతుల జాబితా-2025లో సీఎం రేవంత్ రెడ్డికి గుర్తింపు లభించిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు.