- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Nitin Gadkari: ఆరు నెలల్లో పెట్రోల్ కార్లకు సమానంగా ఈవీ ధరలు: నితిన్ గడ్కరీ

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మరో ఆరో నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) ధరలు ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. బుధవారం 32వ కన్వర్జెన్స్ ఇండియా, 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్‌పోలో మాట్లాడిన ఆయన.. స్థానిక ఉత్పత్తి, దిగుమతులకు ప్రత్యామ్నాయం, కాలుష్య రహితం అనేది ప్రభుత్వ విధానమన్నారు. మూడో ఆర్థికవ్యవస్థగా భారత్ ఎదగాలంటే మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మంచి రోడ్లను నిర్మించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించుకోవచ్చు. స్మార్ట్ సిటీ, స్మార్ట్ రవాణాకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. 212 కిలోమీటర్ల ఢిల్లీ0డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులు మరో మూడు నెలల్లో పూర్తవుతాయి. రోడ్ల నిర్మాణ ఖర్చులను తగ్గించేందుకు కొత్త టెక్నాలజీ, ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ వివరించారు. ప్రధానంగా ఎలక్ట్రిక్ ద్వారా మాస్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు కసరత్తు చేస్తున్నామని గడ్కరీ పేర్కొన్నారు.