- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జనసేన పార్టీ సిద్ధాంతాలు ఇవే.. పవన్ కల్యాణ్ అధికారిక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ కార్యక్రమాలు కానీ, ఏ ఇతర కార్యక్రమాలైనా సరే పర్యావరణాన్ని, పరిసరాలను ధ్వంసం చేసేలాగా నిర్వహించకూడదని.. ఒకవేళ నిర్వహిస్తే, తరవాత ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి స్థానికులకు అందించడమే వారికి అందించే గౌరవంగా జనసేన భావిస్తుంది అని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Jana Sena Party) అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ సిద్ధాంతాలు(Jana Sena Party ideologies) ప్రకటించారు. "పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం" జనసేన పార్టీ ప్రాథమిక సిద్ధాంతాలలో ముఖ్యమైన సిద్ధాంతమని అన్నారు.
ఈ సిద్ధాంతాన్ని సమాజంలోనే కాకుండా, పార్టీ చేపట్టే ప్రతీ కార్యక్రమంలో అమలు చేస్తూ కార్యక్రమం నిర్వహించిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశుభ్రపరిచే కార్యక్రమాలు చెప్పట్టడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో ఘనంగా జరిగిన జయకేతనం బహిరంగ సభ అనంతరం, సభా వేదికను, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కృషిచేసిన ప్రతీ ఒక్క జనసేన నాయకుడికి, జనసైనికులకు, పారిశుధ్య సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కేకే నేతృత్వంలో చిత్రాడలోని సభా వేదిక ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటుగా ఎలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోకుండా వేరు చేసి తరలించడంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు :
1. కులాలను కలిపే ఆలోచనా విధానం
2. మతాల ప్రస్తావన లేని రాజకీయాలు
3. భాషలను గౌరవించే సాంప్రదాయం
4. సంస్కృతులను కాపాడే సమాజం
5. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం
6. అవినీతిపై రాజీలేని పోరాటం
7. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం
రాజకీయ కార్యక్రమాలు కానీ, ఏ ఇతర కార్యక్రమాలైనా సరే పర్యావరణాన్ని, పరిసరాలను ధ్వంసం చేసేలాగా నిర్వహించకూడదు, వేడుకలు నిర్వహించిన వారు, తరవాత ఆ ప్రాంతాన్ని శుభ్రపరచి స్థానికులకు అందించడమే వారికి అందించే గౌరవంగా జనసేన భావిస్తుంది. అంతేకాకుండా "పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి… pic.twitter.com/mKghtzy3wJ
— Pawan Kalyan (@PawanKalyan) March 19, 2025