Trump: జెలెన్ స్కీతో ట్రంప్ ఫోన్ సంభాషణ.. శాంతి ఒప్పందంపై డిస్కషన్

by vinod kumar |
Trump: జెలెన్ స్కీతో ట్రంప్ ఫోన్ సంభాషణ.. శాంతి ఒప్పందంపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ (Putin)తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్ తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) తోనూ ఫోన్‌లో మాట్లాడారు. సుమారు గంటసేపు కాల్పుల విరమణ సహా వివిధ అంశాలపై చర్చించారు. శాంతి ఒప్పందంపై జెలెన్ స్కీతో చర్చించానని ఫోన్ సంభాషణ అనంతరం ట్రంప్ వెల్లడించారు. ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో బుధవారం ఫోన్‌లో మాట్లాడా. శాంతి ఒప్పందంపై రష్యా, ఉక్రెయిన్ అభ్యర్థనలు విన్నాను. వాటి విజ్ఞప్తులు, అవసరాల కారణంగా ఇరు దేశాలను సమన్వయం చేయడానికి ప్రయత్నిస్తా. వారి డిమాండ్లపై ఏకాభిప్రాయం తేవడమే లక్ష్యం. యుద్ధాన్ని ముగించడంపై మేము సరైన దిశలోనే పయనిస్తున్నాం. ఈ సంభాషణల వివరాలను బహిరంగపర్చాలని యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో, భద్రతా సలహాదారు మైక్ వాల్ట్‌లను ఆదేశిస్తా’ అని సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. మరోవైపు కాల్పుల విరమణ అమలుపై చర్చించడానికి త్వరలోనే సౌదీ అరేబియాలో అమెరికా, రష్యా ప్రతినిధులు చర్చలు సమావేశమవుతారని జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్ ప్రకటించారు.

Next Story