- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హీరో విశ్వక్‌సేన్ సోదరి ఇంట్లో చోరీ.. ముగ్గురు దొంగలు అరెస్ట్
by Gantepaka Srikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్(Tollywood) యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) సోదరి ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. బుధవారం సాయంత్రం దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు దొంగల నుంచి భరణాలు స్వాధీనం చేసుకున్నారు. విశ్వక్‌సేన్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లోని రోడ్ నెంబర్-8లో ఉంటున్న విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో మార్చి 16న చోరీ జరిగింది. దీంతో విశ్వక్ సేన్ తండ్రి సి.రాజు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు బంగారు డైమండ్ ఉంగరాలు పోయాయని.. వాటి విలువ రూ.2.20లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇవాళ నిందితులను పట్టుకున్నారు.
Next Story