Salary: ఈ ఏడాది జీతాల పెరుగుదల అంతంతమాత్రమే

by S Gopi |
Salary: ఈ ఏడాది జీతాల పెరుగుదల అంతంతమాత్రమే
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది వివిధ రంగాల్లో జీతాల పెరుగుదల అంతంతమాత్రంగా ఉండనుంది. ప్రముఖ హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ ఓమామ్ కన్సల్టెంట్స్ సర్వే ప్రకారం 2025లో సగటున 9.4 శాతం ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని అంచనా వేసింది. ఇది గతేడాది పెరిగిన 9.7 సాతం కంటే తక్కువ. ప్రధాన రంగాలైన ఆటోమోటివ్, ఎఫ్ఎంసీజీ, ఫార్మాస్యూటికల్‌లలో రెండంకెల వృద్ధితో ఈ పరిశ్రమల్లోని ఉద్యోగులు ఎక్కువ జీతాల పెరుగుదలను చూడనున్నారు. ఈ పరిశ్రమలు 10 శాతం చొప్పున ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నాయి. ఈ మాకర్స్ రంగంలోనూ దాదాపు 10 శాతం వరకు అధిక జీతాలు ఉండవచ్చు అత్యల్పంగా ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో తక్కువ పెంపు ఉండనుంది. ఐటీలో 8.2 శాతం, ఐటీ సంబంధిత పరిశ్రమల్లో 8 శాతం జీతాలు పెరగనున్నాయని ఓమామ్ నివేదిక తెలిపింది. ఆటోమొబైల్స్ మినహా చాలా రంగాల్లో జీతాల పెంపు గతేడాది కంటే చాలా తక్కువ అని నివేదిక అభిప్రాయపడింది. తయారీ, కెమికల్స్, కన్స్యూమర్ రంగాల్లో 9.5 శాతంతో పెరుగుదల స్థిరంగా ఉండనుంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అట్రిషన్ రేటు క్షీణతను నివేదిక సమీక్షించింది. ఈ ఏడాది అట్రిషన్ రేటు 13.6 శాతానికి తగ్గుతుందని ఓమామ్ కన్సల్టెంట్స్ అంచనా వేసింది. 2024లో ఇది 13.75 శాతంగా, 2023లో 22.3 శాతం, 2022లో 17.09 శాతానికి దిగొచ్చింది. దేశంలో జీతాల పెరుగుదలలో క్షీణత ఉన్నప్పటికీ జనరేటివ్ ఏఐ స్కిల్స్ ఉన్న ఉద్యోగుల డిమాండ్ పెరుగుతోందని నివేదిక తెలిపింది. ఏఐ స్కిల్స్ ఉన్న వారికి కంపెనీలు 54 శాతం ఎక్కువ జీతం ఇచ్చి మరీ నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

Next Story