Bill gates: భారత ఏఐ మిషన్, గేట్స్ ఫౌండేషన్‌ల మధ్య త్వరలో ఒప్పందం.. అశ్వినీ వైష్ణవ్

by vinod kumar |
Bill gates: భారత ఏఐ మిషన్, గేట్స్ ఫౌండేషన్‌ల మధ్య త్వరలో ఒప్పందం.. అశ్వినీ వైష్ణవ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా ఏఐ మిషన్, గేట్స్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో త్వరలోనే ఒక అవగాహనా ఒప్పందరం కుదరనున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini vaishnaw) వెల్లడించారు. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్యలో ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికిఈ డీల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. బుధవారం ఆయన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ (Bill gates)తో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం ఆయన పై విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే ఇండియా ఏఐ మిషన్, గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహనా ఒప్పందాలు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓపెన్ సోర్స్ టెక్నాలజీ భవిష్యత్తులో ఓపెన్ ఏఐ (Open Ai) లాగా ఉచితంగా లభించకపోవచ్చని, కాబట్టి సొంత ఎల్ఎల్ఎం వంటివి అభివృద్ధి చేసుకోవడం ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు. అంతకుముందు లోక్ సభ సెక్రటేరియట్ ఏఐ అభివృద్ధికి సాంకేతిక మంత్రిత్వ శాఖతో అగ్రిమెంట్ కుదుర్చుకుందని చెప్పారు.

Next Story

Most Viewed