- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారిపై లీగల్ పరిణామాలను పరిశీలించాకనే చర్యలు : మాదాపూర్ డీసీపీ

దిశ, శేరిలింగంపల్లి : బెట్టింగ్ యాప్స్ పై అన్ని వివరాలు సేకరిస్తున్నామని, ముందు యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్నాక దర్యాప్తు ముమ్మరం చేస్తామని మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ అన్నారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం నిర్వహించిన పలువురు సినీ ప్రముఖులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్స్ పై ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసు స్టేషన్ లో బుధవారం కేసులు నమోదు అయిన ఘటనపై మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్పందించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో పాన్ ఇండియా స్టార్స్ ఉన్న నేపథ్యంలో లీగల్ పరిణామాలను పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. సెలబ్రెటీలు సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు స్టార్స్ తో యాడ్స్ చేసి వివిధ ప్లాట్ ఫామ్స్ లో ప్రమోట్ చేస్తున్నారని, వివిధ సైట్లలో ప్రమోట్ చేయడమే కాకుండా వ్యక్తిగత అకౌంట్లలో ప్రమోట్ చేశారని డీసీపీ వినీత్ అన్నారు.