గ్రామ దేవతల ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలి

by Kalyani |
గ్రామ దేవతల ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలి
X

దిశ,కోదాడ : ఉప్పలమ్మ తల్లి దీవెనలతో రవాణా,వాణిజ్య, వ్యాపార, వ్యవసాయ, విద్య, ఉపాధి రంగాలు సుభిక్షంగా ఉండాలని పలువురు కోదాడ పట్టణ ప్రముఖులు పేర్కొన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని లారీ అసోసియేషన్ కార్యాలయంలో ఉప్పలమ్మ తల్లి పండుగ సందర్బంగా.. ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలన్నారు. గ్రామ దేవతల ఆశీస్సులు కోదాడ ప్రజలకు ఎల్లకాలం ఉండాలన్నారు. ప్రతి ఏడాది ఉప్పలమ్మ తల్లి పండుగ నిర్వహిస్తూ.. సంస్కృతి,సంప్రదాయాలను కొనసాగిస్తున్న లారీ అసోసియేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు తూనం కృష్ణ, సెక్రటరీ ఎలమందల నరసయ్య,సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, వంగవీటి రామారావు,సామినేని ప్రమీల, పైడిమర్రి వెంకటనారాయణ,దొంగరి శ్రీను, విలాస కవి నరసరాజు, అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story