- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Puri JaganathaSwamy Temple : పూరీ ఆలయంలో మరో నూతన విధానం
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయం(Puri JaganathaSwamy Temple)లో భక్తులకు దర్శనం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం(Odisha Govt) సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఈ కొత్త విధానాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభించనున్నట్లు న్యాయశాఖమంత్రి పృథ్వీరాజ్ హరిచందన్(Pruthviraj Harichandan) ఆదివారం తెలిపారు. కొత్త విధానంలో భక్తులు ప్రస్తుతం ఉన్న ద్వారం(సత్పహచ) నుంచి జగన్నాథ ఆలయంలోకి ప్రవేశిస్తారు. అయితే, బయటకు వెళ్లేందుకు మాత్రం రెండు వేర్వేరు దారులును ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా గర్భగుడిలో కొలువైన దేవతామూర్తులను దర్శించుకోవడానికి తరచుగా ఇబ్బందులు ఎదురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కొత్త విధానానికి సంబంధించిన ఏర్పాటు ఈ నెల 27, 28 తేదీల్లోగా పూర్తవుతాయన్నారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామన్నారు. జనవరి ఒకటి నుంచి కొత్త దర్శన విధానం పూర్తిస్థాయిలో అమలులోకి తీసుకువస్తామన్నారు. ఈ కొత్త విధానంలో ఆలయానికి వచ్చే మహిళలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పనుల కోసం ఒడిశా బ్రిడ్జి అండ్ కన్‌స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్‌ని(OBCCL) నియమించి.. ఏడాది చివరికల్లా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.