RSP : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం! ఎక్స్ వేదికగా డీజీపీకి ఫిర్యాదు

by Ramesh N |
RSP : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం! ఎక్స్ వేదికగా డీజీపీకి ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొమురంభీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని కోసినిలో బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లోకి దూరి దొంగలు చోరీకి పాల్పడ్డారు. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గురువారం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తున్నదని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ నిజమని, నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహంలో దొంగలు పడ్డారు.. అని తెలిపారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని వెల్లడించారు. దీని వెనుక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాలని తెలంగాణ డీజీపీకి ఎక్స్ వేదికగా కోరారు.

Advertisement

Next Story