సంగారెడ్డిలో జగ్గారెడ్డి ప్రజా సభ వాయిదా

by Kalyani |
సంగారెడ్డిలో జగ్గారెడ్డి ప్రజా సభ వాయిదా
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 24న పట్టణంలో నిర్వహించే ప్రజాసభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమీషా పార్లమెంట్ సభలో కించపరిచేలా మాట్లాడడం పై తీవ్రంగా నిరసిస్తూ ఈ ప్రజా సభను సంగారెడ్డి లోని గంజి మైదానంలో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించ తలపెట్టారు. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా సభను వాయిదా వేస్తున్నట్లు జగ్గారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా సభను మళ్లీ తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో తేదీ ప్రకటించనున్నట్లు కూడా తెలిపారు. కావున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఈ విషయం పై మన్నించి సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Next Story

Most Viewed