- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Swiggy: స్విగ్గీలో ప్రతి నిమిషానికి 158 బిర్యానీ ఆర్డర్లు
దిశ, బిజినెస్ బ్యూరో: మరో వారం రోజుల్లో 2024 ఏడాది చరిత్రలో కలిసిపోనుంది. మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆహారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అనేక ప్రాంతాలు, అనేక రకాల ఆహార పదార్థాలతో మన దేశం కొత్త రుచులకు ప్రత్యేక వేదికగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే దేశీయంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్ వేగంగా కదులుతోంది. తాజాగా 2024 ఏడాదికి సంబంధించి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఎక్కువగా ఆర్డర్ చేసిన పదార్థాల జాబితాను విడుదల చేసింది. అందులో ఎక్కువమంది ఇష్టంగా బిర్యానీనే ఎంచుకోవడం విశేషం. ఈ ఏడాదిలో మొత్తం 8.3 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ పేర్కొంది. అంటే ఒక్క నిమిషానికి సగటున 158 బిర్యానీ ఆర్డర్లు అందుకున్నట్టు స్విగ్గీ వెల్లడించింది. దీంతో వరుసగా తొమ్మిదవ సంవత్సరం బిర్యానీ అత్యధిక ఆర్డర్లతో అగ్రస్థానంలో నిలిచింది. స్విగ్గీ నివేదిక ప్రకారం, బిర్యానీ తర్వాత 2.3 కోట్ల ఆర్డర్లతో దోస రెండో స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ వివిధ రకాల పాస్తా కోసం దాదాపు రూ. 50,000 ఖర్చు చేశాడని స్విగ్గీ తెలిపింది. ముఖ్యంగా రాత్రి పూట భోజనాలకు ఎక్కువ ఆర్డర్లు వచ్చాయని నివేదిక పేర్కొంది. ఇవి లంచ్ ఆర్డర్ల కంటే 29 శాతం ఎక్కువగా 21.5 కోట్ల ఆర్డర్లు వచ్చాయి. ఇక, 24.8 లక్షల ఆర్డర్లతో దేశంలో అత్యధికంగా ఆర్డర్ చేసిన స్నాక్‌గా చికెన్ రోల్ నిలిచింది. దీని తర్వాత 16.3 లక్షల ఆర్డర్లతో చికెన్ మొమోస్, 13 లక్షల ఆర్డర్లతో పొటాటో ఫ్రైస్ ఉన్నాయి.