Jharkhand: ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

by Y.Nagarani |
Jharkhand: ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్ 81 అసెంబ్లీ స్థానాలకు (Jharkhand Assembly Elections) రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు దశల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. తొలి దశలో 685 మంది అభ్యర్థులు పోటీ పడనున్నాగు. నవంబర్ 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 30న 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. 634 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి రవికుమార్ వెల్లడించారు.

తాజాగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల లిస్టును ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) విడుదల చేశారు. మొదటిదశ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా ఉండనున్న వారిలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్.. జార్ఖండ్ ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని చూస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతలంతా ఇక్కడ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. లిస్టులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా,కేసీ వేణుగోపాల్ సహా.. 40 మంది స్టార్ క్యాంపెయినర్లున్నారు.

Advertisement

Next Story

Most Viewed