- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Police Awards : తెలుగు రాష్ట్రాల పోలీసులకు గృహమంత్రి దక్షతా పదక్ అవార్డులు
దిశ, డైనమిక్ బ్యూరో: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ‘ కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్-2024 ’ అవార్డులను కేంద్ర హోమ్‌శాఖ ప్రకటించింది. స్పెషల్ ఆపరేషన్, ఇన్వెస్టిగేషన్, ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందికి ఈ అవార్డులను కేంద్రం అందజేయనుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 463 మంది పోలీసు సిబ్బందికి గురువారం అవార్డులు కేంద్రం ప్రకటించింది. అవార్డులు అందుకునే వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సహా అస్సాం, బిహార్, అరుణాచల్ ప్రదేశ్, చత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, చండీగఢ్ తదితర ప్రాంతాలకు చెందిన పోలీసులు, సీఆర్పీఎఫ్, సీబీఐ, ఎన్ఐఏ, ఐటీబీపీ వంటి కేంద్ర సాయుధ బలగాల సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఎస్పీలు ఎన్. శ్రీదేవి రావు, కె. కృష్ణ ప్రసన్న, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ఐ టి. జోసెఫ్, హెడ్ కానిస్టేబుల్ స్టాన్‌లీ అవార్డుకు ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి ఒక ఎస్పీ ఆర్. బాస్కరన్‌తో వివిధ విభాగాల నుంచి దాదాపు 25 మంది పోలీసులుకు పురస్కారాలు దక్కాయి.