KTR: ‘ఇలా జరుగుతుందని అనుకోలేదు.’. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |
KTR: ‘ఇలా జరుగుతుందని అనుకోలేదు.’. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: పింఛన్(Pension) కోసం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కేంద్రంలో వృద్ధులు ధర్నా చేశారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తున్నా పెంచి ఇస్తామన్న పింఛన్లు ఇంకా ఇవ్వడం లేదని ఆందోళనలు చేస్తున్నారు. తాజాగా.. ఈ ధర్నాపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ఇలా జరుగుతుందని ఎవరం అనుకోలేదు. తెలంగాణాలో పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కుతారని, టంచన్‌గా అకౌంట్లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరూ అనుకోలేదని అన్నారు.

మూసీ(Musi) బ్యూటిఫికేషన్ కోసం లాక్షా యాభై వేల కోట్లు వెదజల్లి.. కనికరం లేకుండా వృద్ధుల పింఛన్ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు? అని ప్రశ్నించారు. మందుబిల్లల కోసం కొడుకులు, కోడళ్ళ దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే 'మార్పు' వస్తుందని ఎవరనుకున్నారు? అని తెలిపారు. అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు? మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు? అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed