Raghurama Case: CID మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్

by Rani Yarlagadda |
Raghurama Case: CID మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సీఐడీ మాజీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ (Vijay Paul) ను నిన్న రాత్రి 9 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రకటించారు. వైసీపీ హయాంలో ఎంపీ, ఇప్పటి ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnaraju) పై 2021లో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. రఘురామ కేసులో నిన్న ఒంగోలు ఎస్పీ (Ongole SP Office) కార్యాలయంలో విచారణకి హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విజయ్ పాల్ ను విచారించిన పోలీసులు.. రాత్రి అరెస్ట్ చేశారు. రాత్రి నుంచి ఒంగోలు తాలూకా పీఎస్ లో ఉన్న ఆయన్ను.. పోలీసులు నేడు గుంటూరు కోర్టులో హాజరు పరచనున్నారు.

రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో విజయ్ పాల్ ముద్దాయిగా ఉన్నారు. 2021 మే 14న రఘురామను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆపై కస్టడీలో తనను హింసించారని, థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముద్దాయిగా ఉన్న విజయ్ పాల్.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను కోరగా.. ఆ పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. పోలీసులు గతంలో విజయ్ పాల్ ను ఎన్నిసార్లు విచారించినా, ఎన్ని ప్రశ్నలు అడిగినా.. గుర్తులేదు, తెలియదు, మరిచిపోయానని సమాధానమిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed