- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏకమైన దిలావర్‌పూర్.. రోడ్డెక్కిన 4 గ్రామాల ప్రజలు..
దిశ, దిలావర్ పూర్ : నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నాలుగు నెలల నుండి దిలావర్పూర్ గ్రామంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. మంగళవారం సంపూర్ణ బంద్ పాటించారు. వ్యాపారస్తులు వ్యాపార సముదాయాలను, పాఠశాలలను స్వచ్ఛందంగా బంద్ చేసి ఇథనాల్ ఫ్యాక్టరీ జెఏసీకి సంపూర్ణ మద్దతు తెలిపారు. దిలావర్ పూర్, గుండంపల్లి ప్రజలు నిర్మల్ - బైంసా జాతీయ రహదారి పై భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు భారీ స్పందన వచ్చింది. వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి దిలావర్ పూర్ బస్టాండ్ రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు. ఒకే ప్రదేశంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉండటంతో బైంసా నుండి వచ్చే వాహనాలు నర్సాపూర్లో అడ్డుకున్నారు. నిర్మల్ నుండి వచ్చే వాహనాలను సిర్గాపూర్ లో నిలిపివేయించారు పోలీసులు. అయినప్పటికీ భారీగా వాహనాలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిర్మల్ బైంసా జాతీయ రహదారి పై వందలాది మంది ప్రజలు మహిళలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న ఆందోళన మంగళవారం అర్ధరాత్రి దాకా అలాగే ఉంది. ఎస్పీ జానకి షర్మిల బలగాలతో అక్కడికి చేరుకొని బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఎన్ని రకాలుగా నచ్చచెప్పిన ప్రజలు వినిపించుకోవడం లేదు.
రాజకీయ నాయకుల ప్లకార్డుల ప్రదర్శన..
నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులు మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావులు కనిపించడం లేదని ప్లకార్డును ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈతనల్ ఫ్యాక్టరీ రద్దు చేయిస్తామని హామీ ఇచ్చి ఎన్నికలు ముగిశాక ఏ రాజకీయ నాయకులు తమను పట్టించుకోవడం లేదని నినాదాలు చేశారు. బంద్ కారణంగా స్వచ్ఛందంగా పాఠశాల బంద్ చేసి వచ్చినటువంటి విద్యార్థులు ప్లకార్డును చేతబట్టి నినాదాలు చేశారు.
ఆర్డీవోను అడ్డుకున్న మహిళలు
భారీ ఎత్తున ఆందోళన చేస్తున్న మహిళలను ఆందోళన విరమించాలని చెప్పడానికి వచ్చిన నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణిని మహిళలు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ రద్దు అని ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడేంత వరకు తమ ఆందోళన విరమించమని, ఫ్యాక్టరీ వద్దు అని ఆందోళన చేస్తుంటే ఫ్యాక్టరీ వలన ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలపడం ఎంతవరకు సమంజసం అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 7 అయినప్పటికీ ఎవరు కదలకుండా కూర్చోవడం గమనార్హం.