అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సింగరేణి క్వాటర్లు..

by Sumithra |
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సింగరేణి క్వాటర్లు..
X

దిశ, రామకృష్ణాపూర్ : కోల్ బెల్ట్ రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి యాజమాన్యం గతంలో అధికారుల కొరకు బీ టైప్ క్వాటర్లను నిర్మించగా ప్రస్తుతం అవి మందుబాబులకు, సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కనకదుర్గ కాలనీ ఎదురుగా బీ టైప్ క్వాటర్లను అనుకోని గత కొన్నేళ్లుగా ప్రతి ఆదివారం సంత కొనసాగుతుంది. సింగరేణి ఆధ్వర్యంలో నిరాటంకంగా సంత జరుగుతుండేది. సుమారు పదిహేనేళ్లుగా క్వార్టర్లు ఖాళీగా ఉండడంతో యాజమాన్యం ఆ ఏరియాలో వీధిదీపాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం నిర్మానుష్యంగా ఉండటంతో మందుబాబులకు అడ్డాగా మారింది. పట్టణంలోని భగత్ సింగ్ నగర్, నాగార్జున కాలనీ, ఆర్.కె.4 గడ్డ, శాంతి నగర్, అబ్రహం నగర్, అంబేద్కర్ నగర్, సర్దార్ వల్లభాయ్ నగర్, ఇందిరా నగర్, రామ్ నగర్, ఠాగూర్ నగర్, విద్యానగర్ మొదలైన ఏరియాలకు చెందిన మహిళలు కాలినడకన ఆదివారం సంతకు రావాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు.

ప్రతి క్వార్టర్లో ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ గ్లాస్లతో దర్శనమిస్తున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఖాళీ క్వాటర్స్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీస్ పెట్రోలింగ్ వ్యవస్థ ఉన్నా అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతోంది. పోలీసుల గస్తీ పెంచితే అసాంఘిక కార్యకలాపాలకు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు స్పందించి బీ టైప్ ఖాళీ క్వాటర్స్ ప్రాంతంలోని చెట్లను తొలగించి, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed