'Kushnapalli' : పోలీసు వలయంలో 'కుశ్నపల్లి'

by Kalyani |
Kushnapalli : పోలీసు వలయంలో కుశ్నపల్లి
X

దిశ, బెల్లంపల్లి : కుశ్నపల్లి గ్రామం పోలీసు బలగాల పహారలోఉంది. అఘోరీ మాతని స్వంత ఊరు మంచిర్యాల జిల్లా నెన్నల మండలం కుశ్నపల్లి కి రాత్రి తీసుకొచ్చిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. అఘోరీ మాత ఇంటికి చేరిన సమాచారం తెలియడంతో గ్రామస్తులు ఆమెను చూడడానికి ఆసక్తి చూపారు. పరిసర గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చారు. పోలీసులు అఘోరీ మాత ఇంటి చుట్టూ పోలీసులు బందోబస్తు గా ఉన్నారు. అటువైపు వెళ్లడానికి అవకాశం లేకుండా పోవడంతో గ్రామస్తులు నిరాశపడ్డారు. కారులోనే దహనం అయిపోతా అని అఘోరీ మాత ప్రకటించిన నేపథ్యంలో ఆమెను పోలీసులు ఇంటికి తరలించారు. కుశ్నపల్లి గ్రామం లో భారీగా పోలీసుల బందోబస్తు ను ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ అఘోరీ మాత ఉన్న ఇంటికి ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను పరిశీలించారు.

ఆమెను చూడటానికి ఎవరినీ అనుమతించరాదని ఆయన స్థానిక పోలీసులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమెకు ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును చూసి ప్రజలు చర్చించుకుంటున్నారు. మీడియాకు సైతం అఘోరీ మాతను కలిసేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో కుశ్ననపల్లి పరిసర ప్రాంతాల్లోనే సందర్శకులు, మీడియా ప్రతినిధులు నిరీక్షించాల్సి వచ్చింది. శాంతి భద్రతల రీత్యా అఘోరీ మాతను కలిసేందుకు పోలీసులు ససేమీరా అంటున్నారు. కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులకు నిరాశతప్పలేదు. పోలీసు కట్టుదిట్ట భద్రత మధ్య అఘోరీమాత కుశ్నపల్లి గ్రామంలోని తన ఇంటిలో ఎన్ని రోజులు ఉంటున్నారదానిపై ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. పండగ పూట పోలీసులకు అఘోరీ మాత నిద్రపోనివ్వడంలేదు. కుశనపల్లికి అఘోరీ మాత చేరుకుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కుశ్ననపల్లి గ్రామం ప్రధాన చర్చకు వేదికైంది.

Advertisement

Next Story

Most Viewed