నీట్​ లాంగ్​ టర్మ్​ కోచింగ్​ తీసుకుంటున్న విద్యార్థిని అదృశ్యం

by Kalyani |
నీట్​ లాంగ్​ టర్మ్​ కోచింగ్​ తీసుకుంటున్న విద్యార్థిని అదృశ్యం
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లిలో నీట్​ లాంగ్​ టర్మ్​ కోచింగ్​ తీసుకుంటున్న విద్యార్థిని అదృశ్యం అయింది. సూరారంలో నివాసం ఉంటున్న సుబ్రమణ్యం కూతురు ప్రహర్షిణి(17) కూకట్​పల్లిలోని అనాకడమి ఇనిస్టిట్యూట్​లో నీట్​ లాంగ్​ టర్మ్​ కోచింగ్​ తీసుకుంటుంది. రోజు వారి మాదిరిగానే సుబ్రమణ్యం తన కూతురు ప్రహర్షిణిని శనివారం ఉదయం 9 గంటలకు ఇనిస్టిట్యూట్​ వద్ద దింపి వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకు వెళ్లేందుకు ఇనిస్టిట్యూట్​ వద్దకు వెళ్లిన సుబ్రమణ్యంకు ప్రహర్షిణి కనిపించలేదు, ఇనిస్టిట్యూట్​ వద్ద, ప్రహర్షిణి స్నేహితుల వద్ద వాకబు చేశాడు. బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపోవడంతో సుబ్రమణ్యం ఆదివారం కూకట్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్​పల్లి ఎస్సై ఇంద్రసేన తెలిపారు. విద్యార్థిని ఆచూకీ తెలిసినవారు 8712568369 నంబరుకు సమాచారం అందించాలని తెలిపారు.

Next Story

Most Viewed