AP News:విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోంమంత్రి

by Jakkula Mamatha |
AP News:విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోంమంత్రి
X

దిశ ప్రతినిధి,విశాఖపట్నం: వైసీపీ పాలన అంత అధ్వానంగా ఉందని, ఈ రోజుకి విశాఖ జిల్లాలో ఒక పోలీస్టేషన్ రేకుల షెడ్​లో నడుస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్లు చొప్పున 250 కోట్లు పోలీసుశాఖకు రావాలని, ఈ ఐదేళ్లల్లో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పని చేయాల్సిన పరిస్థితి అని అన్నారు. మంగళవారం సాయంత్రం విశాఖ సెంట్రల్ జైలు సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్కార్ట్ వాహనాలు కూడా పని చేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని, పేపర్, పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని అన్నారు. నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయంలో మహిళా పోలీసులు ఉన్నారని, వారు ఏ విధంగా పోలీసులు విధులు చేయగలరని ప్రశ్నించారు. సీఐడీ విభాగంలో నార్కో టెక్ పరీక్షలు ఒక భాగమని, గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదన్నారు.

Next Story

Most Viewed