జూలై 8-9 తేదీల్లో ప్రధాని మోడీ రష్యా పర్యటన

by S Gopi |
జూలై 8-9 తేదీల్లో ప్రధాని మోడీ రష్యా పర్యటన
X

దిశ, నేషనల్ బ్యూరో: 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ప్రధానీ మోడీ జూలై 8-9 తేదీల్లో మాస్కోకు వెళ్లనున్నారు. అదే తేదీల్లో రష్యాతో పాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన ఉంటుందని భారత విదేశాంగశాఖ (ఎంఈఏ) గురువారం ప్రకటించింది. గడిచిన ఐదేళ్ల కాలంలో ప్రధాని మోడీ రష్యాను పర్యటించడం ఇదే మొదటిసారి. ప్రధానంగా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం తర్వాత ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. దేశాధినేతలు రెండు దేశాల మధ్య సంబంధాలను సమీక్షించనున్నారు. పరస్పరం సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై చర్చించనున్నారు. ఇక, రష్యా నుంచి ఆస్ట్రియాకు మోడీ వెళ్లనున్నారు. ఆస్ట్రియాకు భారత ప్రధాని వెళ్లడం 41 ఏళ్లలో ఇదే మొదటిసారి. అక్కడి స్థానిక నేతలను కలవనున్నారు. ప్రముఖ వ్యాపారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు దేశాల పర్యటనల్లో ప్రవాస భారతీయులతో మోడీ సంభాషిస్తారని ఎంఈఏ వెల్లడించింది.

Next Story

Most Viewed