వాతావరణశాఖ హెచ్చరికలు.. చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

by Shamantha N |
వాతావరణశాఖ హెచ్చరికలు.. చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో అతిభారీ వాతావరణశాఖ హెచ్చరిచింది. జూన్ 7-8 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో, ఆదివారం చార్ ధమ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. భక్తులందరూ జూలై 7న రుషికేశ్ నుంచి చార్ ధామ్ యాత్రను ప్రారంభించవద్దని సూచించారు. ఇప్పటికే తీర్థయాత్రకు వెళ్లిన వారు ఎక్కడున్నా అక్కడే వేచి ఉండాలని ఆయన అన్నారు. వాతావరణం అనుకూలించే వరకు ఉన్నచోటే ఉండాలని కోరారు.

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు

గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో బద్రీనాథ్ వెళ్లే హైవే అనేకచోట్ల రోడ్డు బ్లాక్ అయ్యింది. చమోలీ జిల్లా కర్ణప్రయాగ్‌లోని చత్వాపీపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించారు. జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ దగ్గర అలకనంద ప్రమాదకస్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో, ఉత్తరాఖండ్ లోని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

Advertisement

Next Story