ICC Women's T20 World Cup: ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్..ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక ఘోర పరాజయం

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-05 16:29:42.0  )
ICC Womens T20 World Cup: ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్..ఆస్ట్రేలియా చేతిలో శ్రీలంక ఘోర పరాజయం
X

దిశ, వెబ్‌డెస్క్:యూఏఈ(UAE)లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్(ICC Women's T20 World Cup)లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా(AUS) టీమ్ బోణి కొట్టింది.షార్జా(Sharjah) వేదికగా శనివారం గ్రూప్-ఏ లో భాగంగా శ్రీలంక(Sri Lanka)తో జరిగిన మ్యాచులో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.ఈ మ్యాచులో శ్రీలంక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 93 పరుగులే చేసింది.ఆ జట్టు తరుపున నీలాక్షి డి సిల్వా 29 పరుగులతో ఆకట్టుకోగా,హర్షిత మాధవి (23),అనుష్క సంజీవని (16) పరుగులు చేశారు.మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమతవడంతో శ్రీలంక అతి తక్కువ స్కోర్ నమోదు చేసింది.ఆస్ట్రేలియా బౌలర్లలో మెగాన్ షెట్ 3 వికెట్లు పడగొట్టగా.. సోఫీ మోలినెక్స్ 2, గార్డెనర్,వేర్ హామ్ తలో వికెట్ తీశారు.

అనంతరం 94 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 14.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా టార్గెట్ ఛేదించింది.కంగారూలు ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత క్రమంగా పుంజుకొని విజయం సాధించింది. ఆసీస్ తరుపున ఓపెనర్ బెత్ మూనీ (43 పరుగులు 38 బంతుల్లో), ఎల్లీస్ పెర్రీ (17 పరుగులు 15 బంతుల్లో) రాణించారు.మూడు వికెట్లతో అదరగొట్టిన మెగాన్ షెట్(Megan Schutt)కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(Player of the Match)' అవార్డు లభించింది.కాగా శ్రీలంకకు ఈ టోర్నీలో వరుసగా ఇది రెండో ఓటమి.ఇక శ్రీలంక తన తదుపరి మ్యాచ్ ఈ నెల 9న దుబాయ్(Dubai) వేదికగా టీమిండియా(Team India)తో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed