Ahmednagar: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్‌..పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

by Maddikunta Saikiran |
Ahmednagar: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ ఇక అహిల్యానగర్‌..పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్:మహారాష్ట్ర(Maharashtra)లోని అహ్మద్‌నగర్(Ahmednagar) జిల్లా పేరును అహిల్యానగర్‌(Ahilyanagar)గా మారుస్తూ షిండే ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకున్నవిషయం తెలిసిందే. ఆ రాష్ట్ర సర్కారు జిల్లా పేరును మారుస్తూ ఈ సంవత్సరం మార్చి నెలలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తాజాగా ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది.ఈ విషయాన్నిఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి(Revenue Minister) రాధాక్రిష్ణ విఖే పాటిల్(Radhakrishna Vikhe Patil) వెల్లడించారు.18వ శతాబ్దంలో ఇండోర్‌(Indoor)ను పరిపాలించిన మరాఠా రాణి అహిల్యాబాయి హోల్కర్(Ahilyabai Holkar) పేరునే అహ్మద్‌నగర్‌కు పెట్టామన్నారు.అహిల్యాబాయి హోల్కర్ అహ్మద్‌నగర్ జిల్లాలోనే జన్మించారని రాధాక్రిష్ణ విఖే పాటిల్ తెలిపారు.కాగా మహారాష్ట్ర ప్రభుత్వం గతంలో ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పేరును ధారాశివ్‌గా మార్చింది.

Advertisement

Next Story

Most Viewed